నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి.
Read Also : “భీమ్లా నాయక్”కు తప్పని కష్టాలు… పోస్టర్ లీక్
ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు కాగా, యువరాజ్ సినిమాటోగ్రాఫర్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘మాస్ట్రో’ త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే… ఆ తేదీని మాత్రం ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు. బహుశా ఆగస్ట్ 23నే అధికారికంగా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.