సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) కార్యాలయంలో భారీ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో ఎంపీ కేశినేని చిన్నీ, నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు రామ అబ్బరాజు పాల్గొని కేక్ కట్ చేసి విజయాన్ని పంచుకున్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘నారీ…