మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో ఆయన కీలక నేత. ఒకానొక సమయంలో సీఎం రేస్ వరకు వెళ్లారు. రాజకీయాలంటే బోర్ కొట్టిందో ఏమో సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక సామాన్యుడిలా మారిన ఆయన జీవనశైలిని చూసి ఆశ్చర్యపోయారు జనం. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. మరి.. ఇకనైనా అజ్ఞాతం వీడతారా? ఎవరా నాయకుడు? రెండున్నరేళ్లుగా నీలకంఠాపురంలోనే రఘువీరారెడ్డి! మెరిసిన గడ్డంతో.. సామాన్య రైతులా కనిపిస్తున్న ఈయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో…