సోమాలియా తీరంలో హైజాక్ చేయబడిన ఎంవీ లీలా నార్‌ఫోక్ అనే నౌకలోని 15 మంది భారతీయులతో సహా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. వారందరిని భారత నేవీ కమాండోలు కాపాడారు. హైజాక్‌కు గురైన సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అందులోని సిబ్బందిని రక్షించారు.