Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు, ఆ దేశ క్రికెట్ జట్టుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగ్లా వ్యాప్తంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుండటంపై భారత్‌లో నిరసన వ్యక్తమవుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేకేఆర్ అతడిని వదులుకుంది. ఇదిలా ఉంటే, దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్లేయర్లు, అక్కడి ప్రభుత్వం హద్దులు మీరి భారత్‌ను విమర్శించాయి.
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2026 ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస తర్వాత ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ ఆడదాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో నిరసనలు చెలరేగాయి. దాంతో ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. బీసీసీఐ నిర్ణయంతో ముస్తాఫిజుర్ భారీ మొత్తంలో డబ్బు కోల్పోనున్నాడు.…
Mustafizur Rahman: కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తీసేయడాన్ని భారత్‌లోని కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. రాజకీయాలను, క్రీడల్ని ముడిపెట్టొద్దని అన్నారు.
భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ…
ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) భారీ ధరకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2025 డిసెంబర్ 16న అబూదాబీలో జరిగిన వేలంలో ముస్తాఫిజూర్‌ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే వేలం ముగిసిన కొద్ది రోజులకే అంతా మారిపోయింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజూర్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా…
క్రికెట్ విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం తీవ్రమవుతోంది. పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పై నిషేధం విధించిన తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎల్ 2026 ప్రసారాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ బంగ్లాదేశ్ అధికారులు జనవరి 5న ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఐపీఎల్‌కు సంబంధించిన ప్రసారాలు, కార్యక్రమాలను తక్షణమే నిలిపివేసినట్లు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఇప్పటికే లిటన్ దాస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు ఫిబ్రవరి 7…
BJP Leader: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు దాడులుకు పాల్పడుతున్నారు. గత రెండు వారాల్లో ముగ్గురు హిందువుల్ని దారుణంగా చంపేశారు. అయితే, దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌పై పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇటీవల వేలంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కొనుగోలు చేసింది.
భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తల మధ్య ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పదం కుదరడంతో.. మే 17 నుంచి మ్యాచ్‌లు పున:ప్రారంభం కానున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం.. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు.. తిరిగి భారత్‌కు చేరుకుంటున్నారు. అయితే కొందరు ప్లేయర్స్ తాము ఐపీఎల్ 2025కి…
టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలన విజయం నమోదైంది. శ్రీలంకను బంగ్లాదేశ్ ఓడించేంది. పెద్ద జట్లకు చిన్న టీమ్స్ దడపుట్టిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్ వేదిక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Mustafizur Rahman is likely to be available for the CSK vs KKR Match: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తే.. సీఎస్కే మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో రెండే విజయాలు అందుకుంది. టోర్నీలో ముందంజ వేయాలంటే.. ఈ మ్యాచ్…