నటరత్న యన్.టి.రామారావు ఏకాదశ ప్రియుడు. పదకొండు అంటే ఆయనకు ఇష్టం. నిజానికి ఆయన అదృష్ట సంఖ్య తొమ్మిది అయినా, లెక్కల్లో పదకొండుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తమ చిత్రాలలో నటించిన వారికి, పనిచేసిన సాంకేతిక నిపుణులకు పదకొండు నంబర్ వచ్చేలా పారితోషికం ఇచ్చేవారు. అదే తీరున తారకరామా ఫిలిమ్ యూనిట్ పతాకంపై యన్టీఆర్ నిర్మించి, నటించిన డ్రైవర్ రాముడు చిత్రానికి పనిచేసిన వారికీ పారితోషికాలు ఇచ్చారు. 1979 ఫిబ్రవరి 2న విడుదలైన డ్రైవర్ రాముడు చిత్రం అఖండ విజయం…