నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి…