అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటారు అధికారులు. కుదరదని అడ్డంగా కూర్చుంటారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఏం చేయాలో.. ఎవరికి సర్దిచెప్పాలో తెలియక తలపట్టుకుంటున్నారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. మున్సిపాలిటీల నుంచి ఫోన్లు వస్తే ఎమ్మెల్యేలకు హడల్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ధర్నాలు! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్‌పల్లి, నస్పూర్, చెన్నూరు,…