మెదక్ జిల్లా తూప్రాన్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి గాయత్రి నగర్ కాలనీ, ఏబీ కాలనీతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. భారీ వరదతో ఇళ్లు నీటమునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
High Court Serious: హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పిస్తూ, వారి వ్యవహార శైలిపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. ఒక భవన నిర్మాణ దారుడి పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు.. భవనం పూర్తయ్యేంతవరకూ మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. Read Also:…
Bhadradri Incident : భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే…