ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డ్ మెడపై దాడి చేయబోయింది కుక్క. తృటిలో ఆ కుక్క బారి నుంచి తప్పించుకున్నాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వీధి కుక్కలు ఎక్కడపడితే.. అక్కడ దాడులకు తెగబడుతున్నాయి. ఈ వీధి కుక్కల దాడిలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే.. ముంబై గోరేగావ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లోని ఆదర్శ పాఠశాలలో వీధి కుక్క పాఠశాల సెక్యూరిటీ గార్డు మీదికి దూకి భుజాన్ని కరిచింది. కానీ ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు సెక్యూరిటీ గార్డ్. ఈ దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. కుక్క కరిచిన సంఘటన తర్వాత మరో సెక్యూరిటీ గార్డు ఆ వీధి కుక్కపై దాడి చేయడం కూడా వీడియోలో కనిపించింది.
అయితే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు మన్సిపాలిటీ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
सिद्धार्थ नगर, गोरेगांव पश्चिम में आवारा कुत्तों का आतंक!
आवारा कुत्तों के हमले से स्थानीय लोग दहशत में हैं। आदर्श विद्यालय स्कूल के पास कुत्ते राहगीरों पर अचानक हमला कर रहे हैं, जिससे कई लोग घायल हुए हैं। सीसीटीवी फुटेज में एक कुत्ते को सिक्योरिटी गार्ड पर हमला करते देखा गया। pic.twitter.com/LoDX1910QV
— Aman Kumar Dube (@Aman_Journo) December 12, 2025