తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం…