ఐపీఎల్ 2025 ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన హార్దిక్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథ్యం కూడా కోల్పోనున్నాడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్‌ను తప్పించి.. మిస్టర్ 360, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలోనే ముంబై మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం…