ముంబయి నటి కాదంబరి జిత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితి వెల్లడించారు. ఈ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ముంబయి నటి కాదంబరి జేత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జేత్వాని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు.
ముంబై సినీ నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు జారీ చేశారు.