ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పను మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు. సంప్రదాయ దుస్తులతో, అచ్చతెలుగు అమ్మాయిలా లంగా ఓణి దరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీ, మిస్ ఇండియా ఖాతాల ద్వారా నందిని గుప్తా పంచుకున్నారు. Also Read:Rajnath Singh: రక్షణ మంత్రితో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ.. నార్త్ బ్లాక్‌కు బీఎస్ఎఫ్ చీఫ్.. సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు..…
ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోలను ఏరివేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక ఆపరేషన్ తో వణికిపోయిన మావోలు కర్రెగుట్ట ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని వేడుకున్నారు. మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రకటన విడుదల…
Minister Seethakka : ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి…
Doctor Negligence: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనకి ఇప్పుడు ఓ నిండు ప్రాణం భలి అయ్యింది. డెలివరీ కోసం గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరిన గర్భిణీ విల్లా రవళికి సరైన వైద్య సేవలు అందకపోవడంతో, పుట్టబోయే బిడ్డ మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. విల్లా రవళిని నార్మల్ డెలివరీ కోసం వైద్యులు ఆసుపత్రిలో ఉంచినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో ఆపరేషన్ చేయాలని.. లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళతామని కుటుంబ సభ్యులు…
Mulugu: ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాన్ని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 08:30 గంటలకు మంత్రులు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 09:15 గంటలకు ములుగు జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద హెలిపాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి…
SP Shabarish : ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు పెట్టినట్టు మంగళవారం ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు స్పందించారు. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులకు మాత్రం ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. అడవుల్లో నివసిస్తూ తమ జీవనోపాధిని సాగిస్తున్న ఆదివాసీలపై ఈ విధమైన బెదిరింపులు న్యాయసమ్మతం కావని ఎస్పీ…
Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో…
Tiger Tension : గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ , కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ లు కలిసి పులి ఆనవాళ్ళ కొరకు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండంగా, రాంపూర్ అటవీ ప్రాంతంలోని మగ పులి ఆనవాళ్ళను మరోసారి కనుక్కోవడం జరిగింది.…
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి…
మావోయిస్ట్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది. వరుస సంఘటనలతో ములుగు ఏజన్సీ ప్రాతంలో టెన్షషన్ వాతావరణం నెలకొంది. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం ప్రధాన రహదారులు అడుగు అడుగున తనిఖీలు చేస్తున్నాయి. తెలంగాణ ఛత్తీష్‌గఢ్ సరిహద్దులలో వరుస ఎన్కౌంటర్లతో వాజేడు వెంకటాపురం ఏజెన్సీ వాసులలో ఒక్కసారిగా భయాందోళన ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ ఏ తూటా పేలితుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ…