ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోలను ఏరివేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక ఆపరేషన్ తో వణికిపోయిన మావోలు కర్రెగుట్ట ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని వేడుకున్నారు. మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని ఆ లేఖలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
Also Read:Uttam Kumar Reddy: బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి
మరోవైపు ఆపరేషన్ కగార్ కు సన్ స్ట్రోక్ ముప్పు తలెత్తింది. ఎండలు దంచికొడుతుండడంతో జవాన్లు వడదెబ్బకు గురవుతున్నారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలు వడ దెబ్బ బారిన పడుతున్నారు. 40 మంది జవాన్లు వడదెబ్బతో డీ హైడ్రేషన్ కు గురయ్యారు. జవాన్లను ఆర్మీ హెలికాప్టర్ లో భద్రాచలం హాస్పిటల్ కు తరలించారు.