ములుగు జిల్లాలోని ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ నేడు (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాలతో కలిపి కొత్త రెవెన్యూ డివిజన్‌ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.