Huge Blast At Mosque In Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో భాగంగా, ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పశ్చిమ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలోని గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాలిబన్ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు కూర్పు నచ్చకనే ఆ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ముల్లా బరాదర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ముల్లా మహమ్మద్ హసన్ ప్రధాని అయ్యారు. అదే విధంగా, ప్రభుత్వంలో హుక్కానీలకు పెద్దపీట వేస్తూ పదవులు అప్పగించారు. గతంలో దోహాలో జరిగిన సమావేశంలో తాలిబన్లు…
ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఈ చర్చ సాగుతోంది.. తాజాగా.. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. ఇక, తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది… తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు…