పట్టుమని పది సినిమాలు కూడా నిర్మించలేదు. కానీ, నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. త్రికరణ శుద్ధితో చేసే పనులు విజయం సాధిస్తాయి అని ప్రతీతి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు నచ్చిన పనిని త్రికరణ శుద్ధితో చేసేవారు. అందువల్లే తండ్రి యమ్.యస్. రెడ్డి చిత్రసీమలో సాధించని విజయాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అలా ‘తండ్రిని మించిన తనయుడు’ అనిపించుకున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి 1958…