మంగళవారం ముంబైలో జరిగిన 27వ ఎడిషన్ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు కారణం.. ఎవరూ ఊహించని రీతిలో హిట్‌మ్యాన్ బరువు తగ్గడమే. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడంను లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో 95 కేజీల నుంచి 75 కిలోలకు బరువు తగ్గాడు. 20 కేజీల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు యువ క్రికెటర్లకే పోటీనిచ్చేలా ఉన్నాడు.…