ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అదిరిపోయే న్యూస్. లెజెండరీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2028 వరకూ ఐపీఎల్‌లో కొనసాగనున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే 2028 వరకూ ధోనీ ఆడనున్నాడన్న వార్తతో సీఎస్‌కే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఐపీఎల్‌లో ధోనీ చివరి మ్యాచ్ ఎప్పుడు అన్న ప్రశ్నకు కనీసం నాలుగేళ్ల గ్యారంటీ దొరికినట్టే అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.…