US Predator drone Deal: అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల(MQ-9B సీగార్డియన్ డ్రోన్) కొనుగోలు ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) గురువారం ఈ ఒప్పందానికి ఓకే చెప్పింది. అయితే ఈ కొనుగోలుకు ప్రక్రియకు ముందు ఈ డీన్ ను భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.