ఒక పార్టీకి చెందిన నాయకుడు ఎంపీగా ఉండి..... ఆ పరిధిలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే....ఆ లోక్‌సభ నియోజకవర్గం వ్యవహారాలు అంత సవ్యంగా జరగవన్నది సహజం. కానీ... అంతా ఒకే పార్టీ వాళ్ళయి ఉండి కూడా తేడాలు జరుగుతుంటే... దాన్నేమనాలి? అలాంటి ప్రశ్నలే వస్తున్నాయట ప్రస్తుతం అనంతపురం నియోజకవర్గం ప్రజలకు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు, తన పరిధిలోని అదే పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు.