ఆయనో సీనియర్ నేత. కొంతకాలం రాజకీయ జీవితానికి గ్రహణం పట్టినా.. మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఢిల్లీలో పెద్దలసభకు పంపింది అధికారపార్టీ. అదేంటో…! చేతిలో పెద్దపదవి ఉన్నా.. పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరట. దాంతో ఆయనకేమైంది అని చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇంతకీ ఎవరా నాయకుడు? రాజ్యసభ సభ్యుడు అయ్యాక మార్పు వచ్చిందా? KR సురేష్‌రెడ్డి. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ఎమ్మెల్యే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు…