పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును…