MP's followers raised slogans of Khalistan: పంజాబ్ రాష్ట్రంలో నెమ్మదిగా ఖలిస్తానీ ఉగ్రవాదులు వేర్పాటువాద బీజాలు నాటుతున్నారు. ప్రస్తుతం ఏకంగా భారతదేశ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్న వ్యక్తి అనుచరులే ఖలిస్తాన్ కు మద్దతుగా ‘‘ ఖలిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శిరోమణి అకాలీదళ్(ఏ) అధ్యక్షుడు, పంజాబ్ సంగ్రూర్ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు తిరస్కరించడంతో సోమవారం రాత్రి ఆయన మద్దతుదారులు ఈ చర్యకు పాల్పడ్డారు.…