సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పేరు చెప్పి, ఓటీపీలు అడిగి, బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అంటూ.. వివిధ రకాలుగా ఖాతాదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను మోసగించాడో సైబర్ నేరగాడు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఎంపీ సంజీవ్ కుమార్ కు ఫోన్ వచ్చింది.…