Madhya Pradesh Rain: మధ్యప్రదేశ్‌లో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వానకు వరద పరిస్థితి తలెత్తింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మాల్వా, నిమార్ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు 8,700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.