దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల భాగంగా మంగళవారం నాడు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు. లోక్సభ సీట్ల సంఖ్యలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33% కంటే ఇది చాలా తక్కువగా కనబడుతుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు…