దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల భాగంగా మంగళవారం నాడు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు. లోక్సభ సీట్ల సంఖ్యలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33% కంటే ఇది చాలా తక్కువగా కనబడుతుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎంపీలు కాగా ఈసారి నలుగురు మహిళా ఎంపీల సంఖ్య తగ్గింది.
Actress Death: క్యాన్సర్‌తో మూడేళ్ల పోరాటం.. చికిత్స అందక నటి మృతి!
1952లో మొదటిసారి ఎన్నికల జాగా అప్పుడు 4.41% మాత్రమే మహిళా ఎంపీలు ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత 1957లో 5.46%, ఇలా 2004 ఎన్నికల వరకు కేవలం సింగిల్ డిజిట్ పర్సంటేజ్ మాత్రమే మహిళా ఎంపీలు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 11 శాతం మహిళలు ఎంపీలుగా విజయకేతనం ఎగిరి వేశారు. కొన్ని దేశాలతో పోలిస్తే ఈ శాతం చాలా తక్కువగా ఉంది. మహిళా ఎంపీలు ఎక్కువగా దక్షిణాఫ్రికాలో 46% మహిళలు ఎంపీలు ఉండగా.. ఇంగ్లాండ్లో 35%, అలాగే అమెరికాలో 29 % మంది మహిళలు ఎంపీలుగా పనిచేస్తున్నారు.
X – Elon Musk: ఇకపై “ఎక్స్” లో అధికారికంగా పోర్న్ వీడియోలు అప్లోడ్?
2024లో 14 పార్టీల నుంచి మహిళా లోక్‌సభ ఎంపీలు వచ్చారు. ఈ జాబితాలో 31 మంది మహిళా ఎంపీలతో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.., కాంగ్రెస్ (13), టిఎంసి (11), ఎస్‌పి (5), డిఎంకె (3), చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపిఆర్‌వి, జెడి(యు) నుండి ఇద్దరు ఉన్నారు. ఇక మరో ఏడు పార్టీలకు ఒక్కో మహిళా ఎంపీ ఉన్నారు. టీడీపీ నుండి ఏకైక మహిళ ఎంపీగా నంద్యాల నుండి బైరెడ్డి శబరీ గెలుపొందింది. మొత్తంగా 2024 లో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు.