ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లిన విషం తెలిసిందే.. అయితే, అది ఒరిజినల్ కాదు.. ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.. కానీ, ఇప్పుడు మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో ఫోరెన్సిక్ నివేదికను బయటపెట్టింది టీడీపీ.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఇంకా రచ్చ సాగుతూనే ఉంది.. ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు.. ఈ వ్యవహారం కేంద్రం వరకు వెళ్లింది.. ఓ ఎంపీ ప్రధాని దృష్టికి తీసుకెళ్తే.. జాతీయ మహిళా కమిషన్ … లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి.. ఆ సంగతి తేల్చమని కోరింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండానే.. ఆ…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారం ఢిల్లీకి చేరింది.. ఇప్పటికే అనంతపురం ఎస్పీ అది ఫేక్ వీడియోఅని ప్రకటించారు.. ఆ తర్వాత విపక్షాలపై వైసీపీ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. అయితే, ఆ వ్యవహారం అంతటితో ఆగిపోలేదు.. ఎంపీ మాధవ్‌పై పంజాబ్‌కు చెందిన ఓ ఎంపీ, తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. లేఖల…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది.. అధికార, ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించడం చర్చగా మారింది.. అయితే, ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్… కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు తెలుగుదేశం…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విచారణలో ఉందని తెలిపారు.. ఫోరెన్సిక్ నివేదిక త్వరగానే వస్తుందని.. అది నిజమని తేలితే శిక్ష, చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు… అయితే, ఈ ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. టీడీపీ మహిళా నేతలు మాటలు, బాడీ లాంగ్వేజ్…
ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరన్న చంద్రబాబు.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిందే తప్పు.. పైగా మళ్ళీ ఒక కులాన్ని దూషిస్తున్నాడని మండిపడ్డారు.. ఎంపీ పై చర్యలు తీసుకుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్‌రావు.