ఇన్సిడెంట్స్& హ్యాపెనింగ్స్ పొలిటికల్ లైఫ్‌ని మలుపు తిప్పుతాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రాజకీయ ప్రయాణం కూడా అలాంటిదే. పోటీ చేయడానికి సీటే లేదనుకుంటున్న టైంలో ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించింది అధినాయకత్వం. రాజ్యసభ సభ్యుడిగా గొల్ల బాబూరావుకు మరో నాలుగేళ్ళ పదవీ కాలం వుంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తాం అంటున్నారు.. రాజీనామాలు అవసరం లేదు.. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెబితే చాలు అంటూ కూటమి నేతలకు సలహా ఇచ్చారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు..