అత్తాపూర్ మూసీ పరీవాహక ప్రాంతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసేది పేదల కోసం కాదు.. డబ్బు సంచుల కోసం, బ్లాక్ మెయిలింగ్ కోసమని ఆరోపించారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. నడమంత్రపు సిరితో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని దుయ్యబట్టారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు.. బిల్లులు రాక 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు రేవంత్ అన్నారు.