ఫిలిం ఫెడరేషన్లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ గత 13 రోజులుగా సమ్మె చేస్తోంది. ఈ పోరాటం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తమ ఆవేదనను, సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తూ, నిర్మాతలు తమను అన్యాయంగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ కాల్‌షీట్‌కు డ్రైవర్‌కు 1195 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒకటిన్నర కాల్‌షీట్‌కు 1800 రూపాయలు వస్తాయి. అయితే, మూడేళ్లకు ఒకసారి కేవలం 30 శాతం వేతనం పెంచితే, దానిలో 50…