భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ అధికారులు అమానుష చర్యకు పాల్పడ్డారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల కర్కశంగా వ్యవహరించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. లక్షలు వెచ్చించి మోటారు బోర్లు తవ్వుకున్న రైతులకు తీరని నష్టాన్ని కలిగించారు. చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు మోటారు బోరులో రాళ్లు వేశారు. మీడియం లక్ష్మీ అనే గిరిజన మహిళ రైతు పంట పొలంలో వేసిన మోటారు బోరులో ఫారెస్ట్ బీట్ అధికారి రాళ్ళు వేశాడు.…