Delhi Car Blast: వారం క్రితం ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘‘వైట్ కాలర్’’ మాడ్యూల్‌గా పిలువబడుతున్న ఈ ఉగ్రదాది వెనకాల ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు సూత్రధారులుగా ఉన్నారు.