సాధారణంగా ఒక ఇంట్లో డెలివరీ అయిందంటే చాలు.. అందరి అటెన్షన్ మొత్తం ఆ చిన్నారి పైనే ఉంటుంది. శిశువు క్షేమం గురించి ఆలోచించే క్రమంలో కన్నతల్లి ఆరోగ్యాన్ని అందరూ విస్మరిస్తుంటారు. డెలివరీ అయిన మొదటి రోజు నుంచే ఒక తల్లి తన నిద్రను పూర్తిగా త్యాగం చేస్తుంది. పసి పాప ఏడుపు, పాలు పట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడంలో ఆమెకు విశ్రాంతి అన్నది కరువవుతుంది. తన డైట్ విషయంలో కూడా ఎన్నో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది.…