Nandyal District: ఆస్తికోసం మనుషులు రక్కసులుగా మారుతున్నారు. ఆస్తి వస్తుందంటే.. కన్న తల్లి ప్రాణాన్ని తీసేంత కసాయిలుగా మారిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) రాళ్ల కొత్తూరులో ఇలాంటి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కర్మ కాండలు పూర్తి కాక ముందే ఆస్తి కోసం కన్న తల్లిని చంపేందుకు కొడుకు, మనవళ్ల యత్నించారు.
కన్న తల్లి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంత మందికి ఆస్తులపై ఉన్న ప్రేమ.. సొంత వారు.. కన్నవారిపైన ఉండడం లేదు. పైగా తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ కసాయి కొడుకు.. కన్న తల్లిపైనే కొడవలి ఎత్తాడు. తుచ్ఛమైన ఆస్తి కోసం…