ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా స్టిర్లింగ్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో అతడి ఖాతాలో ఈ రేర్ రికార్డు చేరింది. స్టిర్లింగ్ ఇప్పటివరకు 160 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇదివరకు ఈ రికార్డు భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ టీ20…