Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్‌జోన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
దేశంలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది.. మనం పీల్చే గాలిలో ఎన్నో విషపూరీత వాయువులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది.. ఈ ఏడాది అత్యంత కాలుష్యం నగరాల లిస్ట్ లోకి బాలాసోర్ నిలిచింది..…