మన పెద్దలు, ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే వాకింగ్ చేయాలని తరచూ సూచిస్తుంటారు. అయితే చలికాలంలో మంచుతో తడిసిన పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? నేటి అనారోగ్యకరమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేవగానే మొబైల్ ఫోన్‌ను చూడటం అలవాటు చేసుకున్నారు. ఈ అలవాటు మానసిక ఒత్తిడిని పెంచడమే కాకుండా అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా అధికం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే తాజా…