Montha Cyclone: మొంథా తుఫాను తీరం వైపు దూసుకొచ్చేస్తుంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఓడలరేవు – అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటబోతుంది తుఫాన్. అయితే తుఫాను ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తి తీరం దాటే వరకు ఐదు గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఆ ఐదు గంటలే కీలకమంటున్నారు వాతావరణ శాఖ…