Montenegro mass shooting: బాల్టిక్ దేశం మాంటెనెగ్రోలో దారుణం జరిగింది. సిటింజే సిటీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 11 మందిని హతమర్చాడు. వేటాడే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మాంటెనెగ్రో పోలీస్ డైరెక్టర్ జోరన్ బ్రిడ్జానిన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 34 ఏళ్ల వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.