IMD: ఈ ఏడాది జూన్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ సంస్థ( ఐఎండీ ) తెలియజేసింది. గత 122 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నెలలో దక్షిణాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. సగటు ఉష్ణోగ్రతను మించి ఈ దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జూన్ నెలలో 34.04 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. అంతకుముందు 2014లో చివరిసారిగా జూన్ నెలలో 33.74 డిగ్రీసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. 1901 నుంచి పోలిస్తే జూన్ నెలల్లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు. సగటు ఉష్ణోగ్రతలను పరిశీలించినా.. ఈ ఏడాది జూన్ లోనే అత్యధికంగా 30.05 డిగ్రీలు నమోదు అయింది.
Read Also: Tejaswini Pandit: ఆదిపురుష్ శూర్పణఖ రియల్ లైఫ్ లో ఇన్ని కష్టాలను ఎదుర్కొందా?
ఇక వర్షపాతం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో జూన్ నెలలోనే అత్యల్ప వర్షపాతం నమోదు అయింది. 1901 నుంచి పరిశీలిస్తే 1976లో 90.7 మి.మీ వర్షాపాతం నమోదు అయితే.. 88.6 మి.మీల వర్షపాతం నమోదు అయింది. ఈ ఏడాది దక్షిణాదిలో రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీనికి తోడు అరేబియా సముద్రంలో అదే సమయంలో బిపార్జాయ్ తుఫాన్ ఏర్పడింది. దీంతో రుతుపవనాల విస్తరణ ఆగిపోయింది. ఫలితంగా వర్షాపాతం తగ్గడంతో పాటు ఎండలు దంచికొట్టాయి. జూన్ 25 వరకు ద్వీపకల్ప భూభాగంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.