Parliament Monsoon Session: దేశంలో ధరల పెరుగుదలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. నిత్యావసర ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కొద్దిరోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పక్షం ఈ అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపింది. సోమవారం లోక్‌సభలో ధరల పెరుగుదలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ పచ్చి వంకాయ…