Monsoon Brides: భారత ఉపఖండంలోని దేశాలకు రుతుపవనాలే జీవనాధారం. రుతుపవనాలపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే, పాకిస్తాన్‌లో మాత్రం ‘‘రుతపవన పెళ్లికూతుళ్లు’’ పెరుగుతున్నారు. బాల్యంలోనే వారి తల్లిదండ్రులు వివాహాలు జరిపిస్తున్నారు. 2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా, ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి.