Monkey fever: కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్’ వ్యాధి కలవరపెడుతోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)గా పిలువబడే ఈ వ్యాధి బారిన పడి మరో వ్యక్తి మరణించాడు. చిక్కమగళూర్‌లో 43 ఏళ్ల వ్యవసాయ కూలీ బుధవారం ఉదయం మృతి చెందింది. కేఎఫ్‌డీ ఇన్‌ఫెక్షన్‌తో మహిళ ఫిబ్రవరి 21న శివమొగ్గలోని మెగాన్ హాస్పిటల్‌లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. మరోవైపు కేఎఫ్‌డీ వ్యాక్సిన్ల స్టాక్ అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Monkey Fever Cases: కర్ణాటక రాష్ట్రంలో ‘‘మంకీ ఫీవర్’’ కేసులు భయాందోళనలను రేపుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో గత 15 రోజుల్లో 31 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. వ్యాధి సోకిన వారిలో 12 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగతా వారు ఇంట్లేనే వైద్యం తీసుకుంటున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. సిద్ధాపూర్ తాలూకాలోనే…
దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. గత నెల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన ఫీవర్ కేసు బయటపడింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా..…
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కేసు బయటపడింది. మంకీ ఫీవర్ అంటే కోతుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణం సంభవించే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. Read…