ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు