పుట్టిన రోజున లాటరీ టిక్కెట్టు కొన్న ఓ బ్రిటన్ మహిళకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అక్కడి వారి…