పుట్టిన రోజున లాటరీ టిక్కెట్టు కొన్న ఓ బ్రిటన్ మహిళకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అక్కడి వారి నమ్మకం. దీంతో, ఆమె ఆ రోజున లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసింది.
Also Read: MS Dhoni: నువ్వు మహా చిలిపి బ్రో.. అభిమానిని ఆట పట్టించిన ధోని
పుట్టిన రోజు నాడే ఓ మహిళకు కోట్లు కలిసి వచ్చాయి. బంఫర్ లాటరీ తగలడంతో ఒక్కసారిగా ఆమె జీవితం మారిపోయింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చే ఓ బంఫర్ ఆఫర్ ను ఆమె గెలుచుకుంది. అయితే దీనికి కారణం మాత్రం ఓ సాలీడు అని చెబుతుంది ఆ మహిళ. వివరాల్లోకి వెళ్తే..ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవల తన పుట్టిన రోజును జరుపుకుంది. అయితే తన బర్త్ డే రోజే ఆ మహిళకు వాళ్ల ఇంటిలో ఉన్న గడ్డిపై మనీ స్పైడర్ కనిపించింది. అయితే అలా కనిపిస్తే డబ్బు పరంగా కలిసి వస్తుందని బ్రిటన్ లోని వారు నమ్ముతారు.
దీంతో ఆమె వెంటనే వెళ్లి ఓ లాటరీని కొనుగోలు చేసింది. కొంతకాలానికి ఆమెకు ఆ లాటరీ కంపెనీ నుంచి ఓ మొయిల్ వచ్చింది. ఆమె పుట్టన రోజు నాడు కొన్న టికెట్ కు బంపర్ లాటరీ తగిలిందని నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుందని అందులో ఉంది. ఇది చూసిన ఆ మహిళ ఒక్కసారిగా ఉబ్బితబ్బిబైపోయింది. ఆనందంలో ఈ విషయం అందరితో పంచుకుంది. తనకు సాలీడు కనిపించడం వల్లే లాటరీని కొనుగోలు చేశానని, అదే తనకు ఇంతటి లక్ తెచ్చి పెట్టిందని చెబుతుంది డోరిస్. ఈ లాటరీ రావడంతో తన 100 ఏళ్లు సంపూర్ణంగా బతకాలనిపిస్తుందని అంటుంది. లాటరీ తగలడంతో చుట్టూ పచ్చగా ఉండే ప్రదేశంలో ఒక పెద్ద బంగ్లా కొనుగోలు చేస్తానని, తన బంధువులందరిని విదేశీ టూర్ కు తీసుకువెళతానని ఈ సందర్భంగా డోరిస్ చెప్పింది.