Paralympics 2024: ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్-2024లో భారత్ పతకాల ఓపెన్ చేసింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్థానంలో అవని నిలిచి.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.